భారత్​లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు..నిన్న ఒక్కరోజే ఎన్ని నమోదయ్యాయంటే?

0
102

ఇండియాలో కరోనా ఎంతటి కల్లోలం సృష్టించిందో తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇక కరోనా పీడ విరగడ అయింది అనుకున్న తరుణంలో కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. రోజుకు దేశవ్యాప్తంగా 10 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ప్రజలంతా తప్పనిసరిగా కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

ఇక తాజాగా కేంద్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం..గత 24 గంటల్లో 10,725 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. ఈ మహమ్మారి కారణంగా ఒక్కరోజులో 36 మంది  మరణించారు. అలాగే 13,084 మంది కరోనా నుంచి కోలుకున్నారు.  రికవరీ రేటు 98.60 శాతానికి పెరిగింది. యాక్టివ్​ కేసులు 0.21 శాతంగా ఉన్నాయి.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. కొత్తగా 739,171 కేసులు వెలుగు చూశాయి. మరణాలు కూడా భారీగా పెరిగాయి. ఒక్కరోజులో 2 వేల మందికి పైగా మరణించారు. మొత్తం కేసులు 60,31,85,878 కోట్లకు చేరుకున్నాయి.

మొత్తం కేసులు: 4,43,78,920

క్రియాశీల కేసులు: 94,047

మొత్తం మరణాలు: 5,27,488

కోలుకున్నవారు: 4,37,57,385

పెరుగుతున్న కేసుల పట్ల అప్రమత్తంగా ఉండండి..కరోనాను తరిమి కొట్టండి

బయటకు వెళ్తే మాస్క్ తప్పనిసరిగా వాడండి..అదే మనకు శ్రీరామ రక్ష