దేశంలో పెరిగిన కరోనా కేసులు..45 మంది మృతి

0
102
RT-PCR mandatory

దేశంలో కరోనా మహమ్మారి పూర్తిగా తొలగిపోలేదు. ఇప్పటికే మూడు వేవ్ లుగా వచ్చిన మహమ్మారి ఎందరినో పొట్టన బెట్టుకుంది. ఇక కరోనా పోయిందనుకునే సమయానికి కేసుల సంఖ్య పెరుగుతుండడం ఇప్పుడు అందరిని కలచివేసింది. దీనితో అందరిలోనూ భయం నెలకొంది.

తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 16906 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా..మరో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ నుంచి తాజాగా 15,447 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.51 శాతానికి పడిపోయింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.29 శాతానికి పెరిగింది.

మొత్తం మరణాలు: 5,25,519

యాక్టివ్​ కేసులు: 1,32,457

కోలుకున్నవారి సంఖ్య: 4,30,11,874