మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు – అమెరికాలో భారీగా న‌మోదు

Corona cases on the rise again in America

0
93
Corona

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా ఎంత దారుణంగా విజృంభించిందో క‌ళ్లారా చూశాం .ముఖ్యంగా అమెరికాలో దారుణాతి దారుణంగా కేసులు న‌మోదు అయ్యాయి. అయితే దేశంలో స‌గానికి స‌గం మందికి క‌రోనా టీకా ఇచ్చారు. దీంతో కేసులు చాలా వ‌ర‌కూ త‌గ్గుతాయి అని భావించారు. ఇక కొంద‌రు మాస్కులు కూడా తీసేసి ఇక డైలీ రొటీన్ లైఫ్ లోకి వ‌చ్చేశారు.

కాని వ్యాక్సీన్ స‌గం మందికి వేసినా మ‌ళ్లీ కేసులు సంఖ్య పెరుగుతోంది. ఇక పావు శాతం మంది రెండు డోసులు వేసుకున్నారు .అయినా కేసులు మ‌ళ్లీ ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. రికార్డు స్థాయిలో రోజువారీ కేసులు నమోదవుతున్నాయి.

నిన్న ఒక్కరోజే దేశంలో 8.07 లక్షల టెస్టులు చేస్తే, 70,740 కేసులు నమోదయ్యాయి. రెండు రోజులుగా కేసులు చూస్తే పెరుగుతున్నాయి. ఇక రోజ‌వారీ కేసుల్లో మ‌ళ్లీ అమెరికా మొద‌టి ప్లేస్ లోకి వ‌చ్చింది. అయితే టీకా తీసుకోని ప్రాంతాల్లో కేసులు ఎక్కువ వ‌స్తున్నాయి అని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో మొత్తంగా 16.33 కోట్ల మందికి పూర్తిగా టీకాలేశారు.