దేశంలో రోజువారి కరోనా కేసుల సంఖ్యలో స్వలంగా పెరుగుదల నమోదైంది. కొత్తగా 6,984 మంది కొవిడ్ బారిన పడ్డారు. మరో 247 మంది వైరస్‌తో మరణించారు. 24 గంటల వ్యవధిలో 8,168 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మరోవైపు ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దేశంలో రోజురోజుకు ఒమిక్రాన్ కేసులు పెరగడం కలవరపెడుతున్నాయి.
మొత్తం మరణాలు: 4,75,888
యాక్టివ్ కేసులు: 87,562
కోలుకున్నవారు: 3,41,46,931
ప్రపంచవ్యాప్తంగా 6,08,382 కొత్త కరోనా కేసులు వెలుగుచూశాయి. తాజాగా 7,271 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 27,17,37,744 చేరగా.. మొత్తం మరణాలు 53,36,869 పెరిగాయి. 24 గంటల వ్యవధిలో 4,99,003 మంది కోలుకున్నారు.
మరోవైపు దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది. మంగళవారం 68,89,025 మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్ అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 1,34,61,14,483కు చేరింది.