భారత్ లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు..220 మంది ప్రాణాలు తీసిన మహమ్మారి!

Corona cases rise again in India..220 pandemic

0
92

భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న నేపథ్యంలో కేసుల సంఖ్య పెరగడం  కలవరపెడుతున్నాయి.

తాజాగా 24 గంటల వ్యవధిలో 16,764 కొత్త కరోనా కేసులు వెలుగుచూశాయి. అలాగే మరో 220 మంది ప్రాణాలు కోల్పోయారు. 7,585 మంది కోలుకున్నారు. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,270కి చేరింది. మరోవైపు దేశంలో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. గురువారం మరో 66,65,290 మందికి వ్యాక్సిన్లు అందించారు. దీంతో ఇప్పటి వరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,44,54,16,714 కు చేరింది.

మొత్తం కేసులు: 3,48,38,804

మొత్తం మరణాలు: 4,81,080

యాక్టివ్ కేసులు: 91,361

కోలుకున్నవారు: 3,42,66,363

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు ఆందోళనకర రీతిలో నమోదవుతున్నాయి. ఒక్కరోజే 18 లక్షలకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. 6,827 మంది ప్రాణాలు కోల్పోయారు. సంక్రాంతి తర్వాత కరోనా థర్డ్ వేవ్ వస్తుందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది.