ఒడిశా మయూర్‌భంజ్‌లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. 259 విద్యార్థులు, 20 మంది సిబ్బంది ఉన్న ఈ పాఠశాలలో పెద్దఎత్తున కేసులు బయటపడటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. బాధిత విద్యార్థులకుకరోనా పరీక్షలు నిర్వహించగా 26 మందికి కొవిడ్ నిర్ధరణ అయినట్లు తాజా నివేదికల్లో వెల్లడైంది. ప్రస్తుతం బాధితులందరినీ పాఠశాల ప్రాంగణంలో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
రెసిడెన్షియల్ పాఠశాలలో కరోనా కలకలం
Corona commotion in a residential school