దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని రోజుల నుంచి దేశంలో 20 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే నేడు కేసులు పెరగడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది.
కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 11,539 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,42, 65998కు చేరింది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 99,879కు చేరింది. కరోనా పాజిటివిటి రేటు 98.48 శాతంగా ఉంది. తాజాగా 43 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 527332 కి చేరింది.
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 13,900 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యాప్తంగా ఆ రికవరీల సంఖ్య 43712218 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2.096 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో 26 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.