ఇండియాలో కరోనా డేంజర్ బెల్స్..భారీగా పెరిగిన కొత్త కేసులు

0
126
RT-PCR mandatory

ఇండియాలో కరోనా మహమ్మారి ఎంతటి కల్లోలం సృష్టించిందో తెలిసిన విషయమే. ఈ మహమ్మారి కొత్త వేరియంట్లుగా పుట్టుకొచ్చి పెను నష్టాన్ని మిగిల్చింది. ఇప్పటికి మూడు వేవ్ లుగా వచ్చిన ఈ మహమ్మారి ఎందరినో పొట్టనబెట్టుకుంది. ఇక తాజాగా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది.

తాజాగా కేంద్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం..గడిచిన 24 గంటల్లో 20,038 మందికి కరోనా సోకింది. తాజా కేసులతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 4.56 కోట్ల మంది కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసులు 4,37,10,027కు చేరాయి.

ఇందులో 4,30,45,350 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,604 మంది మృతిచెందారు. మరో 1,39,073 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత కొన్నిరోజులుగా భారీగా నమోదవుతున్న రోజువారీ కరోనా కేసులు 5 నెలల తర్వాత మొదటిసారిగా గురువారం 20 వేలు దాటడంతో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.