కరోనా డేంజర్ బెల్స్..ఒకేరోజు లక్ష కేసులు..భయాందోళనలో ప్రజలు

0
106
RT-PCR mandatory

కరోనా ప్రపంచాన్ని కుదుపేసింది. ఈమధ్య కరోనా వేరియెంట్ ఒమి క్రాన్, మంకీ ఫాక్స్ కలవర పెడుతున్నాయి. తాజాగా ఫ్రాన్స్ లో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.

అక్కడ ఒకేరోజు లక్ష కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 1,04,611 మందికి పాజిటివ్​గా తేలినట్లు ఫ్రాన్స్ శానిటరీ అథారిటీ వెల్లడించింది. మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత ఒకే రోజు అత్యధిక కేసులు ఇవే కావడం గమనార్హం.

దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉందని ఫ్రాన్స్ వైద్య శాఖ మంత్రి ఒలీవర్ వెరన్ పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లో ఒమిక్రాన్ కేసులే అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. అయితే, ఆంక్షలు విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అధికారులు తెలిపారు.