కరోనా డేంజర్ బెల్స్..1700 మంది పోలీసులకు పాజిటివ్‌

0
85

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా థర్డ్‌ వేవ్‌ కల్లోలం సృష్టిస్తోంది. ఢిల్లీ ప్రతి రోజు 30 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. దీంతో..నైట్‌ కర్ఫ్యూ లాంటి కరోనా ఆంక్షలను ఢిల్లీ సర్కార్‌ అమలు చేస్తుంది. ఇక తాజాగా 1700 మంది పోలీసు సిబ్బంది కరోనా సోకింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి జనవరి 12 తేదీల మధ్యలోనే 1700 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీస్‌ శాఖ కాసేపటి క్రితమే ప్రకటించింది.