కేరళలో కరోనా కేసులు కేసులు తగ్గుముఖం పట్టాయి.కొద్ది రోజులుగా రోజుకు 50వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతుండగా.. సోమవారం మాత్రం భారీగా తగ్గాయి. మరో 42,154 మందికి వైరస్ నిర్ధరణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 60,25,669కు చేరింది.కొత్త కేసులు తగ్గినప్పటికీ మరణాలు మాత్రం భారీగా నమోదయ్యాయి.దాంతో ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు. సోమవారం 729 మంది వైరస్‌కు బలయ్యారు. దీంతో మొత్తం మరణాలు సంఖ్య 54,395కు చేరింది.
కేరళలో కరోనా తగ్గుముఖం..కానీ భారీగా పెరిగిన మరణాలు
Corona decline in Kerala..but massive increase in deaths