తెలంగాణలో కరోనా ఉద్ధృతి..నేడు 3,877 కేసులు

0
98

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 3,877 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. అలాగే నేడు మరో ఇద్దరు క‌రోనా కాటుకు బలయ్యారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు కరోనా కాటుకు మ‌ర‌ణించిన వారి సంఖ్య 4,083 కి చేరింది. అలాగే నేడు క‌రోనా వైర‌స్ నుంచి 2,981 మంది కోలుకున్నారు. దీంతో ప్ర‌స్తుతం రాష్ట్రంలో 40,414 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగ గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా 1,01,812 శాంపిల్స్ ను టెస్టు చేశారు.