ఏపీలో కరోనా కల్లోలం..భారీగా పెరిగిన యాక్టివ్ కేసులు..ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

Corona fluctuation in AP..Increased number of active cases..How many cases in that district?

0
122

కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. గతంలో కరోనా కట్టడికి చేపట్టిన లాక్‌డౌన్‌, ఇతర ఆంక్షల కారణంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొత్త వేరియంట్‌తో పాటు కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది.

ఇక తాజాగా ఏపీలో కూడా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 47,420 శాంపిల్స్ ని పరీక్షించగా 12,615 మందికి కరోనా సోకినట్లు తేలింది.  ఫలితంగా రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2140056కి చేరింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 3,674 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

కొత్తగా కోవిడ్ కారణంగా విశాఖ జిల్లాలో ముగ్గురు, చిత్తూరు జిల్లాలో ఒకరు,  నెల్లూరు జిల్లాలో ఒకరు ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14527కు చేరింది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 53871 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 2071658కి చేరింది. నేటి వరకు రాష్ట్రంలో 3,20,12,102 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది..

కాగా గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.

అనంతపురం  951

చిత్తూరు         2338

ఈస్ట్ గోదావరి   627

గుంటూరు  1066

వైస్సార్ కడప  685

కృష్ణ   363

కర్నూల్  884

నెల్లూరు   1012

ప్రకాశం    853

శ్రీకాకుళం 464

విశాఖపట్నం  2117

విజయవాడ   1039

వెస్ట్ గోదావరి   216