కొవిడ్ నాలుగో వేవ్ వచ్చేసింది..తస్మాత్ జాగ్రత్త!

Corona fourth wave arrives..Tasmat caution!

0
78

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు వేవ్ లుగా వచ్చిన మహమ్మారి ఎందరినో పొట్టన బెట్టుకుంది. ఇక కరోనా పోయిందనుకునే సమయానికి కేసుల సంఖ్య పెరుగుతుండడం ఇప్పుడు అందరిని కలచివేసింది. దీనితో ఫోర్త్ వేవ్ రానుందనే భయం అందరిలోనూ నెలకొంది.

ఫ్రాన్స్ లో కొద్ది రోజులుగా నమోదవుతున్న కరోనా కేసులు ఒక్క రోజే 50వేలకు పైగా కనిపిస్తున్నాయి. ఈ కేసుల సంఖ్య దాదాపు రెండు నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. కరోనా కొత్త వేవ్ ను ఎదుర్కొంటున్నామని ఫ్రాన్స్ వ్యాక్సినేషన్ చీఫ్ అలైన్ ఫిషర్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. నమోదవుతున్న కేసులను బట్టి చూస్తుంటే అందులో సందేహమే లేదని వ్యాఖ్యానించారు. కనీస జాగ్రత్తలైన మాస్క్ ధరించడం తప్పనిసరి చేయాలని పేర్కొన్నారు.

‘ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఒకటే.. ఈ కొత్త వేవ్ ఎంత తీవ్రంగా ఉండబోతోంది?’’ అని ఫిషర్ ఆందోళన వ్యక్తం చేశాడు. మిగతా యూరోపియన్ దేశాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఒమిక్రాన్ సబ్‌వేరియంట్లు బీఏ.4, బీఏ.5 చాలా వేగంగా పెరుగుతున్నట్లు సమాచారం. ఈ వేరియంట్లు సాధారణ ఒమిక్రాన్ కన్నా వేగంగా వ్యాపిస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు. అయితే భారత్‌లో కూడా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. దీనితో ఫోర్త్ వేవ్ రానుందనే సూచనలు కనిపిస్తున్నాయి.