దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. కొన్ని రోజుల నుంచి దేశంలో 20 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుతూ వస్తోంది.
ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం..గడిచిన 24 గంటల్లో..16,561 మంది వైరస్ బారినపడ్డారు.దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 18,053 మంది కోలుకున్నారు.
ఇక తాజాగా 49 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండేళ్ల కాలంలో 4.42 కోట్ల మందికి మహమ్మారి సోకగా.. 98.53 శాతం మంది వైరస్‌ను జయించారు. క్రియాశీల కేసులు 1.23 లక్షల(0.28 శాతం)కు తగ్గాయి.