కరోనా హెల్త్ బులెటిన్ విడుదల..కొత్త కేసులు ఎన్ని నమోదయ్యాయంటే?

0
94
RT-PCR mandatory

ఇండియాలో కరోనా ఎంతటి కల్లోలం సృష్టించిందో తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇక కరోనా పీడ విరగడ అయింది అనుకున్న తరుణంలో కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. రోజుకు దేశవ్యాప్తంగా 10 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ప్రజలంతా తప్పనిసరిగా కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

ఇక తాజాగా గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు 10,725 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 68 మంది కొవిడ్​కు బలయ్యారు. ఒక్కరోజులో 13,528 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.61 శాతానికి పెరిగింది. యాక్టివ్​ కేసులు 0.20 శాతానికి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మొత్తం కేసులు: 4,43,89,176

క్రియాశీల కేసులు: 90,707

మొత్తం మరణాలు: 5,27,556

కోలుకున్నవారు: 4,37,70,913