దేశంలో కరోనా కేసుల సంఖ్య గత రోజుతో పోల్చితే స్వల్పంగా పెరిగింది. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం..కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి మళ్లీ ఒక్కసారిగా పెరిగిన కేసులు ఆందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలో కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.
గడిచిన 24 గంటల్లో శనివారం దేశవ్యాప్తంగా 8,774 కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 621 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
ప్రస్తుతం దేశంలో 1,05,691 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 543 రోజుల తర్వాత దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య భారీగా తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో మార్చి తర్వాత రికవరీ రేటు గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.30 శాతానికిపైగా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
మొత్తం కేసులు: 3,45,54,975
మొత్తం మరణాలు: 4,68,554
యాక్టివ్ కేసులు: 1,05,691
మొత్తం కోలుకున్నవారు: 3,39,98,278కు చేరింది.