ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కరోనా మరోసారి తన పంజా విసిరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రపంచం థార్డ్ వేవ్‌ను ఎదుర్కొనుందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. తాజాగా బెంగళూరు ఎయిర్ పోర్టులో వెలుగులోకి వచ్చిన కరోనా కేసులు భయాందోళనకు గురి చేస్తున్నాయి.
సౌతాఫ్రికా నుంచి బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అధికారులు వీరిని వెంటనే బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటల్‌లో క్వారంటైన్‌లో ఉంచారు. వీరికి ఒమిక్రాన్ వేరియంటేనా అన్న నేపథ్యంలో నిర్థారణకోసం శాంపిల్స్‌ను ముంబయి ల్యాబ్ కు పంపించారు.