కరోనా కొత్త వేరియంట్ వచ్చేస్తుంది..తస్మాత్ జాగ్రత్త..!

0
98

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. కరోనా నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్ర‌పంచానికి మళ్ళి కొత్త వేరియంట్లు నొప్పి తెచ్చి అనే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో శాస్త్ర‌వేత్త‌లు ఏమంటున్నారంటే..

క‌రోనా కొత్త వేరియంట్ ఇప్పుడు ఆందోళ‌న క‌లిగిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా తాజాగా xe ఒమిక్రాన్ కొత్త కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ వేరియంట్ మిగతా వాటితో పోల్చితే అత్యంత ప్రమాదకరమని, వేగంగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ కొత్త రకం వేరియంట్‌తో అప్రమత్తంగా ఉండాలని ఆగ్నేసియా దేశాలను హెచ్చ‌రించింది. అంతేకాకుండా 600కంటే ఎక్కువ XE కేసులు నిర్దారణ అయ్యాయని తెలిపాయి. ప్ర‌స్తుతం ఉన్న కొవిడ్-19 టీకాలు ఒమిక్రాన్ రకంపై పనిచేస్తున్నాయని జోఫాహ్లా వెల్లడించారు.