కరోనా నుంచి కోలుకున్నారా ? బ్రష్ మార్చేయండి ఈ జాగ్రత్తలు తీసుకోండి

కరోనా నుంచి కోలుకున్నారా ? బ్రష్ మార్చేయండి ఈ జాగ్రత్తలు తీసుకోండి

0
101

దేశంలో కరోనా కేసులు వేగంగా విజృంభిస్తున్నాయి.. రోజుకి లక్షల్లో కేసులు వస్తున్నాయి.. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి.. అయితే అత్యంత దారుణంగా కొన్ని స్టేట్స్ లో కేసులు వస్తున్నాయి. ఇటీవల కరోనా భారినపడి కోలుకున్న వ్యక్తులకు కూడా మళ్లీ సోకుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే సైంటిస్టులు డాక్టర్లు వీరికి కొన్ని జాగ్రత్తలు చెబుతున్నారు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

1.కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు వెంటనే వారి టూత్ బ్రష్ను మార్చాలని చెబుతున్నారు, అప్పటి వరకూ వాడిన బ్రష్ మొత్తానికి పక్కన పెట్టేయాలి.

2. ఇక కరోనా సమయంలో వాడిన బట్టలు టవల్స్ కర్చీఫ్ లు ఇలాంటివి అన్నీ బాగా వాష్ చేసి ఎండలో ఉంచి ఐరెన్ చేసి అప్పుడు వాడాలి.

3. కచ్చితంగా టూత్ బ్రష్, టంగ్ క్లీనర్ వంటివి మార్చేయండి.

మరో ముఖ్య విషయం సీజనల్గా వచ్చే ఫ్లూ, దగ్గు, జలుబు నుంచి కోలుకున్న వారెవరైనా సరే టూత్ బ్రష్, టంగ్ క్లీనర్లను మార్చాలని వైద్యులు చెబుతున్నారు, దీని వల్ల మళ్లీ ఆ జబ్బులు జలుబు అలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి.

4. మౌత్ వాష్ లేదా బీటాడిన్ గార్గిల్ ఉపయోగించాలి.

5. వేడి నీటిని చల్లార్చి నోటిని శుభ్రం చేసుకోవాలి

6. వీలైనంత వరకూ ఎక్కడైనా ఏదైనా ముట్టుకుంటే అది మళ్లీ ముక్కు నోటికి తగలకుండా జాగ్రత్తగా ఉండాలి.