Breaking News- స్టార్ డైరెక్టర్ కు కరోనా పాజిటివ్

Corona positive to star director

0
110

కరోనా కేసులు తగ్గడంతో జనాలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే, ఈ సమయంలో పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడుతుండటం సినీ పరిశ్రమను ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా దర్శకుడు సురేందర్ రెడ్డి కరోనా బారిన పడ్డారు.

అఖిల్ హీరోగా ‘ఏజెంట్’ సినిమా కోసం డైరెక్టర్ సురేందర్ రెడ్డి యూరప్ కు వెళ్లారు. ప్రస్తుతం యూరప్ లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్న సంగతి తెలిసిందే. అక్కడే ఆయన కరోనా బారిన పడడంతో అక్కడే సెల్ఫ్ క్వారంటైన్ లో వున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. దీంతో షూటింగ్ కు గ్యాప్ ఇచ్చినట్టు సమాచారం. అఖిల్ హీరోగా ‘ఏజెంట్’ చిత్రం తెరకెక్కుతోంది.