ఏపీలో కరోనా ఉగ్రరూపం..ఒక్కరోజే 13,212 కేసులు నమోదు..మరణాలు ఎన్నంటే?

0
91

ఏపీలో కరోనా ఉగ్రరూపం దాల్చుతుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన రేపుతోంది. అలాగే ఏపీలో నిన్నటి కంటే ఇవాళ మరో వెయ్యి కరోనా కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి.  తాజాగా రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,212 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 21,53, 268కి చేరింది.

ఒక్కరోజు వ్యవధిలో మరో ఐదుగురు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 532 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 64, 136 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 2942 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20, 74, 600 లక్షలకు చేరింది.  ఇప్పటి దాకా 3, 20, 56, 618 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

కాగా గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.

అనంతపురం  1235

చిత్తూరు         1585

ఈస్ట్ గోదావరి   816

గుంటూరు  1054

వైస్సార్ కడప  649

కృష్ణ   338

కర్నూల్  961

నెల్లూరు   1051

ప్రకాశం    772

శ్రీకాకుళం 1230

విశాఖపట్నం  2244

విజయవాడ   681

వెస్ట్ గోదావరి   596