ఇప్పటికే ప్రపంచం ఈ వైరస్ తో వణికిపోతోంది, ఓ పక్క దారుణమైన పరిస్దితి నెలకొంది, ఎక్కడ చూసినా ఈ వైరస్ కేసులు వేలల్లో ఉన్నాయి.. ఓ పక్క ఎక్కడా కూడా దీనికి వ్యాక్సిన్ కనిపెట్టలేదు, దీంతో ప్రతీ ఒక్కరూ కూడా అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అమెరికా చైనా ఇటలీ అత్యంత దారుణమైన స్టేజ్ కు చేరుకున్నాయి.
అయితే ఎక్కడా రెస్టారెంట్లు ఓపెన్ అవ్వడం లేదు.. చికెన్ మటన్ షాపులు కూడా కొన్ని చోట్ల బంద్ లో ఉన్నాయి, దీంతో మాంసం ప్రియులు చాలా మంది తమ జిహ్వచాపల్యం ఆపుకుంటున్నారు, మరికొందరు ఇవి ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి తెచ్చుకుంటున్నారు.
కాని ఈ చికెన్ మటన్ బిర్యానికి బదులు చాలా మంది ఇప్పుడు పనస బిర్యాని తింటున్నారు.
మొన్నటివరకు కిలో పనస రూ.50 ఉండగా.. అది కాస్త ప్రస్తుతం రూ.150 కు పెరిగింది. జాక్ ఫ్రూట్ ఈ పనస తింటే మంచిది అని చాలా మంది చెప్పడంతో దీనితో బిర్యాని కూడా చేసుకుంటున్నారు, అయితే కరోనా దీని వల్ల తగ్గుతుంది అనేది నమ్మకూడదు అని చెబుతున్నారు, కేవలం పనస తింటే ఆరోగ్యానికి మంచిది అని అంటున్నారు వైద్యులు.