ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ కొనసాగుతూనే ఉంది. అయితే నిన్నటి కంటే ఇవాళ కరోనా కేసులు కాస్త తగ్గు ముఖం పట్టాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,37,704 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 21,13,365 కు చేరింది. అంటే రోజు వారి పాజిటివిటీ రేటు… 17.22 శాతంగా నమోదు అవుతుంది. ఇండియా వ్యాప్తంగా ఓమిక్రాన్ కేసుల సంఖ్య 10,050 గా నమోదు అయింది. ఇక దేశంలో తాజాగా 448 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,88,884 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,42,676 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,63,01,482 కు చేరింది.
మొత్తం కేసులు: 3,89,03,731
మొత్తం మరణాలు: 4,88,884
యాక్టివ్ కేసులు: 21,13,365
మొత్తం కోలుకున్నవారు: 3,63,01,482