ఈ దుస్తులు ధరిస్తే కరోనా ఖతం అవుతుందట..

ఈ దుస్తులు ధరిస్తే కరోనా ఖతం అవుతుందట..

0
77

ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది… ఈ మహమ్మారి దాటికి అగ్రరాజ్యాలు కూడా అతలాకుతలం అవుతున్నాయి… ఒక వైపు దీన్ని నివారించేందుకు ఆయా దేశాలు అనేక చర్యలు తీసుకుంటుంటే శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్ తయారిలో ఉన్నారు… తాజాగా మర్కెట్ లో యాంటీ వైరస్ దుస్తులు మార్కెట్ లోకి వచ్చాయి స్విట్జర్లాండ్ కు చెందిన హీక్యూతో ఒప్పందం పెట్టుకున్న ముంబైకి చెందిన డోనియర్ ఇండస్ట్రీస్ ఈ తరహా దుస్తులను భారత్ మార్కెట్ లోకి అందుబాటులోకి తెచ్చింది…

యాంటి వైరస్ ఫ్యాబ్రిక్ తో తయారైన ఈ దుస్తులు అందుబాటులో ఉంటాయి… ఈ దుస్తులు 30 నిమిషాల్లోనే ఉపరితలంపై చేరిన వైరస్ ను హతమారుస్తుందని మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అగర్వాల్ తెలిపారు… హీక్యూ వైరోబ్లాక్ ఎన్ఫీజే 03 సాంకేతిక ద్వారా ఇవి తయారయ్యాయని అంటున్నారు.. వైరస్ 99.99 శాతం మేరకు విజయవంతంగా ఈ దుస్తులు నిరోధించాయని తెలిపారు..

వీటిని వినియోగించి యూనిఫాం, జాకెట్లు, చొక్కాలు, తయారు చేసుకోవచ్చని చెప్పారు… ఈ దుస్తులు రోజు వినియోగించినా వైరస్ అడ్డుకుంటుందని అన్నారు… మామూలు దుస్తులతో పోల్చి దీని ధర 20 శాతం అధికంగా ఉంటుందని అన్నారు…–