దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. తాజాగా 18,987 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కొవిడ్ ధాటికి మరో 246 మంది మరణించారు. ఒక్కరోజే 19,808 మంది రికవరీ అయ్యారు. అక్టోబరు 13న 13,01,083 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. ఫలితంగా మొత్తం టెస్టుల సంఖ్య 58,76,64,525కు చేరింది.
బుధవారం ఒక్కరోజే 35,66,347 కొవిడ్ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 96,82,20,997కు చేరినట్లు చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది.
కొత్తగా 4,40,664 మందికి వైరస్ సోకింది. కొవిడ్ ధాటికి మరో 7,506 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 23,99,37,425కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 48,89,385కు పెరిగింది.