తెలంగాణలో కరోనా టెన్షన్ నెలకొంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. తాజాగా రాష్ట్రంలో 1,913 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం తెలంగాణలో 7,847 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.






