కరోనా అప్ డేట్: 532 రోజుల కనిష్ఠానికి​ యాక్టివ్​ కేసులు

Corona update: Active cases for a minimum of 532 days

0
83

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మెల్ల మెల్లగా పెరుగుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో దేశంలో 10,488 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే మరో 313 మంది కోవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోయారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 1,22,714 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, ఇప్పటివరకు మొత్తం 1,16,50,55,210 వ్యాక్సిన్ డోస్‌లను అందించారు. ఆదివారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. కొత్త కేసుల కలుపుకుని దేశంలో ఇప్పటివరకు మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 3,45,10,413 కు పెరిగింది.

దేశంలో రోజువారీ కేసులు వరుసగా 44వ రోజు 20 వేల కంటే తక్కువగా నమోదయ్యాయి. 147 రోజులుగా రోజు వారీ వైరస్​ కేసులు 50 వేలకు దిగువన నమోదవుతున్నాయి. దీంతో గచిడిన 48 రోజులుగా పాజిటివిటీ రేటు 2 శాతానికి (0.98) దిగువన నమోదవుతోంది. 58 రోజులుగా వారాంత (వీక్లీ) పాజిటివిటీ రేటు 2 శాతం (0.94శాతం) కంటే తక్కువగా ఉంది.