భారత్ లో కరోనా కల్లోలం రేపుతోంది. ఓ వైపు ఒమిక్రాన్, మరోవైపు కరోనా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 2,35,532 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లోమొత్తం కరోనా కేసుల సంఖ్య 34,08,58,241 కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
మొత్తం కేసులు: 4,08,58,241
మొత్తం మరణాలు: 4,93,198
యాక్టివ్ కేసులు: 20,04,333
మొత్తం కోలుకున్నవారు: 3,83,60,710
ఇండియాలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 20,04,333కు చేరింది. దేశంలో కరోనా పాజిటివిటి రేటు 96.62 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 871 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 4,93,198కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,35,939 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
దేశ వ్యాప్తంగా రికవరీల సంఖ్య 3,83,60,710 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,65,04,87,260 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక రోజు వారి కరోనా పాజివీటి శాతం 13.39% గా నమోదు అయింది. ఇండియాలో యాక్టివ్ కరోనా కేసులు 4.91% గా నమోదు అయింది.