కరోనా అప్ డేట్- దేశంలో కొత్తగా ఎన్ని కేసులంటే..?

Corona update- How many new cases in the country ..?

0
99

భారత్​లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 11,903 మంది​ వైరస్​ బారిన పడ్డారు. మరో 311 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 14,159 మంది కరోనాను జయించారు. దాంతో క్రియాశీల కేసుల సంఖ్య 252 రోజుల క్రితం నాటికి చేరుకుంది.

రిక‌వ‌రీ రేటు 98.22 శాతంగా ఉంది. నిన్న క‌రోనా వ‌ల్ల 311 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మొత్తం 4,59,191కు చేరింది. నిన్న దేశంలో 41,16,230 డోసుల‌ వ్యాక్సిన్ వేశారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 61.12 కోట్ల క‌రోనా టెస్టులు చేశారు. 107.29 కోట్ల డోసుల‌ వ్యాక్సిన్ వేశారు.

ప్రపంచవ్యాప్తంగా రోజువారి కొవిడ్​ కేసుల్లో పెరుగుదల నమోదైంది. కొత్తగా 3,83,198 మంది వైరస్​ బారినపడ్డారు. కరోనా​ ధాటికి 6,798 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 24,82,62,422 కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 50,28,144 కి పెరిగింది.