కరోనా అప్డేట్..పెరిగిన కేసులు..ఎన్ని నమోదయ్యాయంటే?

0
97

దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. కొన్ని రోజుల నుంచి దేశంలో 20 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుతూ వస్తోంది. కానీ మంగళవారం కన్నా.. బుధవారం కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది.

కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 19,431 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 53 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 5,26, 879 కి చేరింది.

యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,25,076కు చేరింది.

దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,42,06,996 కి పెరిగింది.

నిన్న కరోనా నుంచి 19,431 మంది కోలుకున్నారు.

దేశంలో నిన్న 25,75,389 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.