కరోనా అప్డేట్: భారత్ లో పెరిగిన కేసుల సంఖ్య

Corona update: Increased number of cases in India

0
104

భారత్ లో మరోసారి కరోనా కేసులు పెరిగాయి. కొత్తగా ఏడు వేలకు పైగా కేసులు బయటపడ్డాయి.  మరోవైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్​ కేసులు సంఖ్య 415కు చేరుకుంది. తాజాగా కేసుల సంఖ్య పెరగడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

శుక్రవారం ఒక్కరోజే 11,12,195 నమూనాలను పరీక్షించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 67,10,51,627కు చేరిందని చెప్పింది.ఇక దేశంలో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది.

గురువారం మరో 66,09,113 వ్యాక్సిన్ డోసులు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,41,01,26,404కు చేరింది. ప్రతి ఒక్కరు వాక్సిన్ వేయించుకోవాలని ఆరోగ్యశాఖ సూచించింది. అలాగే తప్పనిసరిగా మాస్క్ వాడాలని కోరింది.

మొత్తం కేసులు: 3,47,79,815‬

మొత్తం మరణాలు: 4,79,520

యాక్టివ్ కేసులు: 77,032

కోలుకున్నవారు: 3,42,23,263