భారత్ లో కరోనా ఉధృతి తగ్గింది. గత కొన్ని రోజుల నుంచి.. 3 లక్షలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదు కాగా నిన్న కేవలం లక్ష లోపు కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ప్రజలకు ఊరట లభించింది. ఇక తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 83, 876 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,22,72,014 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 11,08,938 కు చేరింది. ఇక దేశంలో తాజాగా 895 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,02,874 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,99,054 మంది కరోనా నుంచి కోలు కున్నారు. మరోవైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింది నీరులా విస్తరిస్తుంది.
యాక్టివ్ కేసులు: 11,08,938
మొత్తం మరణాలు: 5,02,874
మొత్తం కోలుకున్నవారు: 4,06,60,202