కరోనా అప్ డేట్: 538 రోజుల కనిష్ఠానికి కొత్త కేసులు

Corona update: New cases for a minimum of 538 days

0
86

దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతూ వస్తుంది. తాజాగా దేశంలో కొత్తగా 8,488 మంది​కి కొవిడ్ ​​​సోకినట్లు తేలింది. దీనితో దేశంలో కరోనా కేసులు 538 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయి. వైరస్ ధాటికి మరో 249 మంది మృతి చెందారు.

కొత్త కేసులు భారత్​లో​ 538 రోజుల కనిష్ఠానికి కొవిడ్ చేరుకోగా..యాక్టివ్​ కేసులు 534 రోజుల కనిష్ఠానికి దిగొచ్చాయి. భారత్​లో నవంబరు 21న 7,83,567 కొవిడ్​ టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది. ఫలితంగా మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 63,25,24,259కి చేరింది.

మొత్తం కేసులు: 3,45,18,901‬

మొత్తం మరణాలు: 4,65,911

యాక్టివ్​ కేసులు: 1,18,443

మొత్తం కోలుకున్నవారు: 33,934,547

కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను విధించింది ఆస్ట్రియా ప్రభుత్వం. నిత్యావసరాల కొనుగోలు, ఆసుపత్రులకు వెళ్లడం వంటి సేవల కోసం కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.