ఇండియాలో కరోనా మహమ్మారి ఎంతటి కల్లోలం సృష్టించిందో తెలిసిన విషయమే. ఈ మహమ్మారి కొత్త వేరియంట్లుగా పుట్టుకొచ్చి పెను నష్టాన్ని మిగిల్చింది. ఇప్పటికి మూడు వేవ్ లుగా వచ్చిన ఈ మహమ్మారి ఎందరినో పొట్టనబెట్టుకుంది. ఇక తాజాగా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది.
తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం..గడిచిన 24 గంటల్లో దేశంలో 21,411 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,38,49,999 కు చేరింది. ఇక యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,50,100కు చేరింది.
ఈ మహమ్మారి బారిన పడి 67 మంది మరణించగా మృతుల సంఖ్య 5,25,997కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 20,726 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యాప్తంగా రికవరీల సంఖ్య 4,31,92, 379 కు చేరింది.