కరోనా అప్ డేట్: తగ్గిన కొత్త కేసులు..మరణాలు ఎన్నంటే?

Corona update: New cases reduced .. What are the deaths?

0
101

దేశంలో కొవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 8,306 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. కొవిడ్ మహమ్మారి కారణంగా మరో 211 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు మాత్రం వణికిస్తున్నాయి.

మొత్తం కేసులు: 34,641,561‬

మొత్తం మరణాలు: 4,73,537

యాక్టివ్​ కేసులు: 98,416

మొత్తం కోలుకున్నవారు: 3,40,69,608

దేశంలో వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది. ఆదివారం 24,55,911 డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 1,27,93,09,669కు చేరిందని స్పష్టం చేసింది.