కరోనా అప్ డేట్: తగ్గిన కొత్త కేసులు..మరణాలు ఎన్నంటే?

Corona Update: Reduced new cases..what are the deaths?

0
109

దేశంలో కొవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 8,603 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. కొవిడ్ మహమ్మారి కారణంగా మరో 415 మంది ప్రాణాలు కోల్పోయారు.

మొత్తం కేసులు: 3,46,24,360

మొత్తం మరణాలు: 4,70,530

యాక్టివ్​ కేసులు: 99,974

మొత్తం కోలుకున్నవారు: 3,40,53,856

దేశంలో వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది. శుక్రవారం 73,63,706 డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 1,26,53,44,975కు చేరిందని స్పష్టం చేసింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒకేరోజు 703,750 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఒక్కరోజే 7,536 మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 265,175,965కు చేరింది. మరణాల సంఖ్య 5,257,959కు పెరిగింది.