దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. 24 గంటల వ్యవధిలో 7,495 కేసులు నమోదయ్యాయి. మరో 434 మంది ప్రాణాలు కోల్పోయారు. 6,960 మంది కోలుకున్నారు. మరోవైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది.
ఇక దేశంలో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. బుధవారం మరో 70,17,671మందికి వ్యాక్సిన్లు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,39,69,76,774కు చేరింది. అటు, ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు ఆందోళనకర రీతిలో నమోదవుతున్నాయి. ఒక్కరోజే 8,85,052 కేసులు వెలుగులోకి వచ్చాయి. 7,220 మంది ప్రాణాలు కోల్పోయారు.
మొత్తం కేసులు: 3,47,65,976
మొత్తం మరణాలు: 4,78,759
యాక్టివ్ కేసులు: 78,291
కోలుకున్నవారు: 3,42,08,926