కరోనా అప్ డేట్: దేశంలో కొత్త కేసులు ఎన్నంటే?

Corona Update: What are the new cases in the country?

0
109

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గింది. అయితే.. ప్రతిరోజూ నమోదవుతున్న కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. రోజూ 10 వేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నాయి.

కాగా.. గడిచిన 24 గంటల్లో (శనివారం) దేశవ్యాప్తంగా 7,774 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 306 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 92,281 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

మొత్తం మరణాలు: 4,75,434

యాక్టివ్ కేసులు: 92,281

కోలుకున్నవారు: 3,41,22,795

ప్రపంచవ్యాప్తంగా 5,03,163 కేసులు వెలుగు చూశాయి. తాజాగా 5,430 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 4,40,695 మంది కోలుకున్నారు. అన్ని దేశాల్లో కలిపి రెండు కోట్లకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.