తెలంగాణలో పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం..టీకా వేసుకున్నాక ఏం చేయాలంటే?

Corona vaccination for children in Telangana begins .. What to do after vaccination?

0
85

తెలంగాణ వ్యాప్తంగా 15-18 ఏళ్ల మధ్య వారికి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. దీనికోసం ఇప్పటికే కొవిడ్ పోర్టల్​లో రిజిస్ట్రేషన్ ప్రారంభం కాగా..తెలంగాణలో 22.78 లక్షల మంది పిల్లలు టీకా తీసుకునేందుకు అర్హత కలిగినట్లు వైద్యఆరోగ్య శాఖ గుర్తించింది.

జీహెచ్​ఎంసీ సహా 12 కార్పొరేషన్లలో ఆన్​లైన్ రిజిస్ట్రేషన్ పద్ధతిలో టీకాలు పంపిణీ చేస్తోంది. ఇతర జిల్లాల్లో మాత్రం వాక్ ఇన్ పద్ధతిలో టీకాలు ఇస్తోంది. పీహెచ్​సీలు, సీహెచ్​సీలు, యూపీహెచ్​సీలు, జిల్లా ఆస్పత్రులు సహా ప్రస్తుతం టీకా అందిస్తున్న కేంద్రాల్లో 15 ఏళ్లు పై బడిన వారికి వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోంది. పిల్లలకోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది.

2007వ సంవత్సరం, అంతకంటే ముందు జన్మించిన వారు వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులని స్పష్టం చేసింది. ఈ వయసు వారికి టీకాలు ఇవ్వటం కాస్త సెన్సిటివ్ విషయంగా పేర్కొన్న సర్కార్.. పిల్లలతో పాటు.. తల్లిదండ్రులు వెంట ఉండాలని కోరింది. 0.5 ఎంఎల్ డోస్ కొవాగ్జిన్ టీకాను పిల్లలకు ఇస్తున్నట్లు తెలిపింది. టీకా తీసుకున్న తర్వాత అరగంట సేపు వ్యాక్సినేషన్ కేంద్రంలో వేచి ఉండాలని సూచించింది.