దేశ వ్యాప్తంగా కరోనా టీకా తీసుకోవడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. ఇక ఇప్పటి వరకూ ప్రయారిటీ ప్రకారం 60 ఏళ్లు పై బడిన వారు 50 ఏళ్లు పైబడిన వారికి టీకాలు అందించారు. తాజాగా కేంద్రం కీలక ప్రకటన చేసింది కరోనా వ్యాక్సినేషన్ లో.
ఇకపై 18 ఏళ్లు నిండిన వాళ్లు సైతం కరోనా వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి నేరుగా డోసులు పొందవచ్చని
తెలిపింది. అంతేకాదు మీరు ముందుగా ఎలాంటి స్లాట్ బుక్ చేసుకో అక్కర్లేదు. అక్కడ వైద్య అధికారులకు మీ పేరు డీటెయిల్స్ ఇచ్చి నమోదు చేసుకోవచ్చు అని తెలిపింది కేంద్రం.
తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది ఈ విషయాలు . ఈ వెసులు బాటుతో దేశంలో కరోనా టీకా ప్రక్రియ మరింత వేగంగా జరుగుతుంది అని భావిస్తున్నారు అధికారులు. దేశంలో 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న వారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వీరిలో చాలా మంది ఇప్పుడు టీకా పొందే ఛాన్స్ ఉంది.