భారత్‌లో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,13,603 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇక దేశంలో తాజాగా 475 మంది కరోనా తో మరణించగా మృతుల సంఖ్య 4,84,246 కి చేరింది.
గడిచిన 24 గంటల్లోనే.. 19,35,180 కరోనా పరీక్షలు చేసింది ఆరోగ్య శాఖ. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య 70,93,56,830 కు చేరింది.
మొత్తం కేసులు:3,82,18,773
మొత్తం మరణాలు: 4,87,693
యాక్టివ్ కేసులు: 19,24,051
మొత్తం కోలుకున్నవారు: 3,58,07,029
ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 19,24,051 కు చేరింది. ఇక దేశం లో రోజు వారి కరోనా పాజిటివిటి రేటు 16.41% శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,23,990 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 9,287 ఒమిక్రాన్ కేసులు నమోదు అయినట్లు పేర్కొంది ఆరోగ్య శాఖ.