కరోనా వైరస్ ఏ వస్తువులపై ఎన్ని గంటలు ఉంటుందో తెలుసుకోండి

కరోనా వైరస్ ఏ వస్తువులపై ఎన్ని గంటలు ఉంటుందో తెలుసుకోండి

0
111

కరోనా వైరస్ గురించి చాలా విషయాలు మనం విన్నాం ..అయితే ఈ వైరస్ అగ్గిపుల్ల పై మందు ఎంత ఉంటుందో తెలుసుగా, అందులో 5కోట్ల వైరస్ లు నింపగలదు అంత చిన్నపరిమాణంలో ఉంటుంది, మనం వాడే శానిటైజర్లలో ఆల్కహాల్… వీటి శరీరంపై ఉండే కొవ్వు పొరను నాశనం చేయగలదు. అందువల్ల కరోనా వైరస్ చనిపోతుంది.

అయితే ఈ వైరస్ 30 డిగ్రీల వేడి ఉంటే తట్టుకోలేదు అంటున్నారు వైద్యులు, నిజమే కాని ఈ వైరస్ రాత్రి పూట తుమ్మినా దగ్గినా వచ్చే అకవాశం ఉంది, అందుకే ఎండ ఉన్నా సమయమే కాదు సాధారణ సమయం కూడా చాలా ఇంపార్టెంట్. మీరు రోజుకు 8 గంటలు నిద్రపోతూ అలాగే పుల్లటి పండ్లు, కూరగాయలు, వేడి వేడి ఆహారాలు తింటే కరోనా వైరస్ సోకినా ప్రాణాలతో బయటపడవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

ఈ వైరస్ గాలిలో దాదాపు 3 గంటలు ఉంటుంది
రాగి పాత్రలుపై 4 గంటలు ఉంటుంది
ప్యాకింగ్ అట్టపెట్టెలపై 24 గంటలు ఉంటుంది
ప్లాస్టిక్, స్టెయిన్లెస్ స్టీల్ వస్తువులపై 2 నుంచి 3 రోజులు ఉంటుంది
అల్యూమినియం, చెక్క, పేపర్లపై 5 రోజులు ఉంటుంది.

అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి.