కరోనా ఎఫెక్ట్ తో ఇప్పుడు చాలా మంది చికెన్ తినాలి అంటేనే భయపడుతున్నారు.. లక్షలాది మందికి ఈ వైరస్ సోకడంతో ఇప్పుడు చికిత్స పొందుతున్నారు.. అయితే చికెన్ తింటే ఈ వైరస్ రాదు అని చెబుతున్నా, చాలా మంది నమ్మడం లేదు.. అందుకే చికెన్ కిలో 40 రూపాయలకు పడిపోయింది.
కొన్ని చోట్ల కోళ్లని ఫ్రీగా ఇచ్చేస్తున్నారు, ఇలా చికెన్ వ్యాపారులు చాలా నష్టపోతున్నారు..
ఓ రైతు దాదాపు 6 వేల కోళ్లను బతికుండగానే ఓ గోతిలో వేసి పూడ్చిపెట్టాడు, ఇలా చాలా వరకూ కోళ్ల వ్యాపారులు నష్టపోతున్నారు, ఈ సమయంలో చికెన్ రేటు ఇలా ఉంటే పనస రేటు మాత్రం దారుణంగా పెరిగింది.
ఆన్ లైన్ ద్వారా పనస బిర్యానీ ఆర్డర్ చేసేవారి సంఖ్య దేశవ్యాప్తంగా పెరిగింది. పనిలో పనిగా ఇళ్లలోనూ పసన బిర్యానీ చేయడానికి ఇష్టం చూపిస్తున్నారు టేస్ట్ బాగుంటుంది హెల్త్ కి కూడా మంచిది అందుకే ఈ బిర్యానీ తినేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. సాధారణంగా కిలో పసన 50 రూపాయలు ఉండేది ఇప్పుడు కిలో 150 కి చేరింది, అదీ సంగతీ.