Covid 19: ఇండియాలో పెరిగిన కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?

0
134

భారత్ లో కరోనా రక్కసి సృష్టించిన కల్లోలం అంతాఇంతా కాదు. ఈ మహమ్మారి దెబ్బకు వేలాది కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ఇప్పటికే మూడు వేవ్ లుగా వచ్చిన ఈ మహమ్మారి ఎంతోమందిని పొట్టనబెట్టుకున్నాయి. ఇక కరోనా పీడ విరగడైంది అనుకునే తరుణంలో కొత్త కేసుల సంఖ్య పెరగడం ప్రజలను ఆందోనళకు గురి చేస్తుంది. కరోనా ఇంకా పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టలేదని, బయటకు వెళ్తే మాస్క్ పెట్టుకోవడం సహా ఇతర జాగ్రత్తలు తీసుకొవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇక తాజాగా కేంద్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం..నిన్న ఒక్కరోజులో 5,221 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే ఈ మహమ్మారిని 5,975 మంది జయించారు. కోవిడ్ బారిన పడి మరో 15 మంది చనిపోయారు.

ఇక రికవరీ రేటు 98.71గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.11గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

జాగ్రత్తలు పాటించండి..కరోనా మహమ్మారిని తరిమికొట్టండి..