Covid 19: గుడ్ న్యూస్..తగ్గిన కరోనా కొత్త కేసులు

0
137
RT-PCR mandatory

భారత్ లో కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం అంతాఇంతా కాదు. ఈ మహమ్మారి దెబ్బకు వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పటికే మూడు వేవ్ లుగా వచ్చిన ఈ మహమ్మారి ఎంతోమందిని పొట్టనబెట్టుకున్నాయి. ఇక కరోనా పీడ విరగడైంది అనుకునే తరుణంలో కొత్త కేసుల సంఖ్య పెరగడం ప్రజలను ఆందోనళకు గురి చేస్తుంది. కరోనా ఇంకా పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టలేదని, బయటకు వెళ్తే మాస్క్ పెట్టుకోవడం సహా ఇతర జాగ్రత్తలు తీసుకొవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇక తాజాగా కేంద్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం..గడిచిన 24 గంటల్లో..4,912 కొత్త కేసులు నమోదయ్యాయి.

దేశంలో కరోనా పాజిటివిటి రేటు 90.01 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది.