దేశంలో 5,910కు చేరిన కొవిడ్ కేసులు..మరణాలు ఎన్నంటే?

0
117

ఇండియాలో కరోనా ఎంతటి కల్లోలం సృష్టించిందో తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇక కరోనా పీడ విరగడ అయింది అనుకున్న తరుణంలో కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఇక తాజాగా కేసుల సంఖ్య తగ్గడంతో ప్రజలకు భారీ ఊరట లభించింది.

కేంద్ర ఆరోగ్యశాఖ రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం..గడిచిన 24 గంటల్లో దేశంలో 5910 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 98.69 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 33 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 5,28,007కి చేరింది.

మొత్తం కేసులు: 4,44,62,445

క్రియాశీల కేసులు: 53,974

మొత్తం మరణాలు: 5,28,007

కోలుకున్నవారు: 4,38,80,464