కరోనా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నది. ప్రపంచంలో ఇప్పటి వరకు మొదటి, రెండో వేవ్ లు విరుచుకుపడి లక్షల మందిని పొట్టనపెట్టుకున్నాయి. ఇండియాలో మొదటి వేవ్ ప్రమాదకారిగా అవతరించలేకపోయింది. పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కానీ రెండో వేవ్ తీవ్ర ప్రభావాన్ని చూపింది. పెద్ద సంఖ్యలో కేసులు, మరణాలు చోటు చేసుకున్నాయి.
ఇండియాలో వచ్చిన వేరియంట్ విషయానికి వస్తే… ఇండియన్ వేరియంట్ గా డెల్టా వేరియంట్ గా దీనికి నామకరణం చేశారు. డెల్టా వేరియంట్ ఇండియోలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ ప్రభావం చూపిందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో తాజాగా డెల్టా వేరియంటో కొత్త రకం డెల్టా ప్లెస్ వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల్లో డెల్టా ప్లెస్ వేరియంట్ కేసులు నమోదవుతూ ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
దేశంలో ఇప్పటి వరు డెల్టా ప్లెస్ కేసులు 40కి చేరుకున్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 21 కేసులు నమోదయ్యాయి. మధ్య ప్రదేశ్ లో 6 కేసులు, కేరళథలో 3 కేసులు, తమిళనాడులో 3 కేసులు నమోదయ్యాయి.
డెల్టా ప్లెస్ వేరియంట్ తీవ్రత ఎలా ఉంటుందో అన్న ఆందోళన కేంద్ర ప్రభుత్వం వర్గాల్లో నెలకొన్నది. డెల్టా ప్లస్ వైరస్ ఆందోళనకరం అని స్పష్టం చేసింది. ఈ కేసుల సంఖ్య నమోదైన 4 రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.