గుడ్ న్యూస్ ఇంటికే కోవిడ్ కిట్ ? అందులో ఉండే వ‌స్తువులు ఇవే

గుడ్ న్యూస్ ఇంటికే కోవిడ్ కిట్ ? అందులో ఉండే వ‌స్తువులు ఇవే

0
92

తెలంగాణ‌లో వైర‌స్ ల‌క్ష‌ణాలు ఉండి పాజిటీవ్ వ‌స్తే హోమ్ ఐసోలేష‌న్ లో ఉంటున్నారు, ఇలాంటి వారికి ఏమైనా ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌రిస్దితి వ‌స్తే వారిని వెంట‌నే కోవిడ్ ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తున్నారు, లేక‌పోతే రోజు స‌రైన మందులు అందించి చికిత్స అందిస్తున్నారు జిహెచ్ ఎంసీ ప‌రిధిలో.

తెలంగాణ స‌ర్కారు తీసుకున్న ఈ నిర్ణ‌యం బాగుంది అంటున్నారు అంద‌రూ.. అయితే ఇలా ఇంటిలో ఉండి చికిత్స తీసుకుంటున్న వారికి క‌రోనా కిట్ అందిస్తున్నారు, మ‌రి అందులో ఏముంటాయో చూద్దాం
ప్ర‌తి కిట్‌లో విట‌మిన్‌-సి టాబ్లెట్లు-34
జింక్ టాబ్లెట్లు-17
బి కాంప్లెక్స్ టాబ్లెట్లు -17
శానిటైజ‌ర్ బాటిల్‌‌-1
హ్యాండ్ వాష్ లిక్విడ్ బాటిల్‌-1
గ్లౌజ్‌లు
సోడియం హైపోక్లోరైట్ ద్రావణం
హోం ఐసోలేష‌న్ బ్రోచ‌ర్ ఇస్తారు

ఈ కిట్ పై క్యూ ఆర్ కోడ్ ఉంటుంది, దాని ద్వారా సెల్ నుంచి స్కాన్ చేస్తే కోవిడ్ స‌ల‌హాలు సూచ‌న‌లు ఉంటాయి…ఈ ప్రాంతాల మెడిక‌ల్ ఆఫీస‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఆరోగ్య సిబ్బందితో పాజిటీవ్ కేసులు న‌మోదైన ఇళ్ల‌లో కరోనా ఐసోలేషన్ కిట్లను నేరుగా అందచేస్తారు.