కొవిడ్-19 సోకి ఉంటే మీ ఇంట్లోనే ఐసొలేషన్ లో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి

కొవిడ్-19 సోకి ఉంటే మీ ఇంట్లోనే ఐసొలేషన్ లో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి

0
146

కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి.. ఈ సమయంలో ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలి, అయితే కోవిడ్ సోకిన వారు మైల్డ్ సింప్టమ్స్ కనిపిస్తే కంగారు పడవద్దు, ఇలా ఇంట్లో ఉండి కోలుకున్న వారు చాలా మంది ఉన్నారు, వైద్యులు ఇదే చెబుతున్నారు, ఒకవేళ ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉండి జ్వరం వాంతులు అవి ఇబ్బంది పెడితే ఆస్పత్రిలో అడ్మిట్ అవ్వండి.

ఇలా కేసులు పెరుగుతున్నప్పుడు అత్యవసరమైతే తప్ప హాస్పిటల్ లొ అడ్మిట్ అవ్వడం కంటే ఇంట్లోనే ఐసొలేషన్ లో ఉండడం మంచిది అంటున్నారు వైద్యులు.. మరి ఏం చేయాలో కూడా చెబుతున్నారు
అవి ఏమిటో చూద్దాం.

కొవిడ్ సోకిన వారు ఇంట్లోనే ఉండండి. సింప్టమ్స్ లేకపోయినా సరే బయటకి రాకండి.ఇంట్లో ఉన్న మిగిలిన కుటుంబ సభ్యుల నుండి ఐసొలేట్ అవ్వండి. వృద్ధులు, పసిపిల్లల దగ్గర మరీ జాగ్రత్తగా ఉండాలి. మీకు ఇంట్లో సౌలభ్యం ఉంటే టాయిలెట్ వేరేది వాడండి, డాక్టర్ దగ్గరకు వెళ్లాలి అంటే ముందు అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. శానిటైజర్ వాడాలి, మీరు వాడిన బట్టలు టవల్స్ వేడి నీటిలో నానబెట్టి ఉతకాలి…ఇక ఇళ్లు రోజూ మూడు పూటలా శుభ్రం చేయండి, తుమ్ము వస్తే కచ్చితంగా కర్చీప్ అడ్డుపెట్టుకోండి.తడి మాస్క్ అసలు వాడద్దు, కచ్చితంగా వేడినీటిలో ఉతకండి.